ఏపీలో కరోనా శాంతి.. నేడు కేసులు తక్కువగా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కరోనా శాంతి.. నేడు కేసులు తక్కువగా..

August 10, 2020

https://www.instagram.com/honey_saarya/?hl=en

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తోంది. రోజూ పదివేలకు పైచిలుకే పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో 7,665 పాజిటివ్ నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,525కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 6,924 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా, ఇప్పటివరకు 1,45,636 మంది కరోనా నుంచి కోలుకుని వివిద ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 80 మంది కరోనాతో బాధపడుతూ చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య 2,116 కు పెరిగింది. 

మృతుల్లో ప్రకాశం జిల్లాలో 11 మంది, గుంటూరులో 10, పశ్చిమ గోదావరిలో 9, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, చిత్తూరు, కర్నూలులో ఆరుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురి చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం 87,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఏపీలో ఒక్కరోజే 46,699 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.