ఫ్యాషన్ డిజైనర్ పెద్దమనసు.. రూ. 1.5 కోట్ల విరాళం  - MicTv.in - Telugu News
mictv telugu

 ఫ్యాషన్ డిజైనర్ పెద్దమనసు.. రూ. 1.5 కోట్ల విరాళం 

March 23, 2020

mnjhg

కరోనా నియంత్రణ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు, సినీ నటులు సహాయం చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితా డోంగ్రే రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనాతో చిన్నాభిన్నమైన చిరువ్యాపారులు, స్వయం ఉపాధి పొందే చేతి వృత్తిదారుల కోసం వైద్య నిధి కింద తాను ఈ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ‘కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. చిరు వ్యాపారులపై పెనుప్రభావం చూపుతుంది. ఈ మహమ్మారితో పెరిగే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మా ఫౌండేషన్‌ ముందుకొస్తోంది’ అని తన ఇన్‌స్టాగ్రాంలో తెలిపారు. 

తమ ఉద్యోగులు అందరికీ వైద్య బీమా ఉందని, ఎమర్జెన్సీ వస్తే వైద్య నిధి నిధులను వారి కోసం కూడా వెచ్చిస్తాం అని చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తన ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం ఆ నిధులను వాడాలని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌కి లేఖ రాశారు. సంబంధిత అధికారి తన ఆఫీస్‌కి వచ్చి చెక్ తీసుకోవాలని గంభీర్ ఆ లేఖలో తెలిపారు.