లాక్‌డౌన్‌తో డయాబెటిస్.. సర్వేలో షాకింగ్ ఫలితాలు - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌తో డయాబెటిస్.. సర్వేలో షాకింగ్ ఫలితాలు

June 30, 2020

Coronavirus Diabatic patients report a rise in blood sugar levels during lockdown by 20

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో పనుల్లేక ప్రజలపై ఒత్తిడి పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఇంటి నుంచే పనిచేస్తుండటంతో చాలామంది జీవన శైలి కూడా మారిపోయింది. కదలకుండా కూర్చొని పనిచేస్తుండటంతో చాలామందిలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ డయాబెటిస్ రోగులపై సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 8,200 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అనేక షాకింగ్ ఫలితాలను వెల్లడించింది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. 

సర్వేల ప్రకారం.. మామూలు డయాబెటిస్ రోగుల్లో ఉండాల్సిన దానికంటే 20 శాతం అధికంగా ఉంది. మార్చి నెల వరకు షుగర్ రీడింగ్ 135 ఎంజీ/ డీఎల్ ఉండగా.. ఏప్రిల్ ఆఖరు నాటికి ఇది 165 ఎంజీ/ డీఎల్‌కు చేరుకుంది.  జీవన శైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ఒత్తిడి ఆందోళన వంటి వాటికి గురికాకుండా మారిన జీవన శైలికి అనుగుణంగా ప్లాన్ ప్రకారం పనులు చేసుకోవాలి. కాగా, మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. రెండు నెలలపాటు ప్రజలు బయటకు రాకుండా ఉండిపోయారు. అయితే, ఇటీవల కాలంలో ఒక్కొక్కటి అన్‌లాక్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని అధికారులు అంటున్నారు.