కరోనా సోకితే ముందుగా కనిపించే లక్షణాలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సోకితే ముందుగా కనిపించే లక్షణాలు ఇవే

March 31, 2020

Coronavirus First Stage Symptoms  

కరోనా సోకితే 14 రోజుల వరకూ ఎటువంటి ఫలితం కనిపించదని అందరికి తెలిసిన విషయమే. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు,దగ్గు,తలనొప్పి, ఛాతీనొప్పి ,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కానీ దీన్ని గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంత వరకూ అప్రమత్తంగా లేకపోతే.. ఈ వైరస్ మరికొందరికి మనకు తెలియకుండానే అంటించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇది మానవ శరీరంలోకి ప్రవేశించగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించ వచ్చని బ్రిటన్‌ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ వెల్లడించారు.

కరోనా వైరస్ శరీంలోకి చేరిన గంటల వ్యవధిలోనే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇది సోకిన వ్యక్తి వాసనను గుర్తించలేరని, ఆపై తినే ఆహార పదార్థాల రుచిని కూడా కోల్పోతారని వెల్లడించారు. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరడానికి ముందు ముక్కులో కొంత సమయం ఆగడం వల్ల ఇది జరుగుతుందని చెబుతున్నారు. ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రధించాలని సూచించారు. దాదాపుగా ఇవి కనిపించిన వారిలో కచ్చితంగా కరోనా లక్షణాలు బయటపడతాయని అన్నారు. ఉన్నట్టుండి వాసన గుర్తించకపోవడం, రుచి రాకపోవడం లాంటి కేసులు కొన్ని రోజులుగా తన క్లినిక్‌ కు వచ్చే రోగులకు ఉంటున్నాయని చెప్పారు. ఇలా ఒక్కసారిగా పెరుగుతున్న కేసులపై పరిశోధన జరిపితే అవి కరోనా వైరస్ సోకిన వెంటనే కనిపించే లక్షణాలని తేలినట్టుగా వెల్లడించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కంగారు పడకుండా ముందు జాగ్రత్తగా  ఉండాలని సూచించారు.