క‌రోనా ఎఫెక్ట్‌..వీడియో కాల్‌లోనే నిఖా - MicTv.in - Telugu News
mictv telugu

క‌రోనా ఎఫెక్ట్‌..వీడియో కాల్‌లోనే నిఖా

March 24, 2020

nbnvcb

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి దాదాపు 16 వేల మంది మృతిచెందారు. ఈ వైరస్‌ను నివారించడానికి అనేక దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ క్రమంలో బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో ఒక‌ వింత ముస్లిం నిఖా జ‌రిగింది. క‌రోనా కార‌ణంగా బీహార్‌లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో వ‌ధూవ‌రులు ఒక్క‌చోట‌కు చేరుకోలేకపోయారు. దీంతో రెండు వైపుల పెద్ద‌లు మాట్లాడుకుని వీడియో కాల్ ద్వారా అనుకున్న ముహూర్తానికే నిఖా జ‌రిపించారు. మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో వ‌ధూవ‌రులిద్ద‌రూ వీడియో కాల్‌లోనే ఒక్క‌ట‌య్యారు. బంధుమిత్రులు కూడా వీడియో కాల్‌లోనే వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి తరువాత ఎవ‌రి ఇండ్ల‌లో వాళ్లే ఉండిపోయారు. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.