హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షా కేంద్రాలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షా కేంద్రాలు ఇవే

June 30, 2020

free

తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులు తక్కువగా చేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టులను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, దాని చుట్టు పక్కల ఉన్న పలు నియోజకవర్గాల్లో 10 రోజుల్లో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి 9 రోజుల పాటు పరీక్షలు నిర్వహించి 36 వేల శాంపిల్స్ సేకరించిన సంగతి తెల్సిందే. అయితే ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు సమయం పడుతుండడంతో ఇన్నాళ్లూ, కొత్త శాంపిల్స్ సేకరణను నిలిపివేశారు. అయితే ఇప్పుడు అన్ని టెస్టుల్లోనూ రిజల్ట్స్ వచ్చేయడంతో, కొత్త శాంపిళ్ల సేకరణకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచితంగా కరోనా పరీక్షలను నిర్వహించడం మొదలెట్టారు. ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలం సీజన్ మొదలైంది కాబట్టి, ఇప్పుడు అవసరమైన మందులు అన్నీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క ఆసుపత్రు లో కూడా మందులు లేవు అనే వార్త రావొద్దని హెచ్చరించారు.

 

ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలు ఇవే…

 

* సరోజిని దేవి కంటి ఆసుపత్రి (రోజుకు 250 శాంపిల్స్ సేకరణ)

* నేచుర్ క్యూర్ ఆసుపత్రి

* ఆయుర్వేదిక్ ఆసుపత్రి

* చార్మినార్ నిజామియా ఆసుపత్రి

* రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి (రోజుకు 150 శాంపిల్స్ సేకరణ)

* వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి

* బాలాపూర్ యూపీహెచ్ సీ

* మహేశ్వరం సీహెచ్ సీ