ఆగని కరోనా మృదంగం.. దేశంలో 424 కేసులు.. 8 మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆగని కరోనా మృదంగం.. దేశంలో 424 కేసులు.. 8 మరణాలు

March 23, 2020

bnnbb

ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా, లాక్‌డౌన్, షట్‌డౌన్ అంటున్నా..  దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తొలిదశలో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకిన ఈ వ్యాధి వారి నుంచి గొలుసుకట్టులా స్థానికులకు కూడా సోకుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

కోల్‌కతాలో తాజా మరణం చోటుచేసుకోవడంతో కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది. ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన 68 ఏళ్ల వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయనకు ఆస్త్మా, మధుమేహం ఉన్నాయి దేశవ్యాప్తంగా మొత్తం 424 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు చేరాయి. తెలంగాణలో 33 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 కేసులు రికార్డయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాలకు వైరస్ వ్యాపించగా 14,757 మరణాలు నమోదయ్యాయి. 3,41,696 మందికి వైరస్ సోకగా, లక్ష మంది పూర్తిగా కోలుకున్నారు. 11 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.