హైదరాబాద్‌లో కరోనా హైరిస్క్ జోన్లు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో కరోనా హైరిస్క్ జోన్లు ఇవే..

July 13, 2020

Coronavirus high risk areas in hyderabad

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున వెయ్యి కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 76 శాతానికిపైగా కేసులు కేవలం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది గ్రేటర్​ పరిధిలోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లాలంటే మిగతా జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చిన ప్రజలు తిరిగి స్వగ్రామాలకు పయనమవుతున్నారు. 

దీంతో 500కుపైగా కేసులున్న 8 ప్రాంతాలను జీహెచ్ఎంసీ హైరిస్క్​ జోన్లుగా గుర్తించింది. ఆ ఏరియాల్లో కంటెయిన్​మెంట్​ జోన్లను ఏర్పాటు చేసి.. స్పెషల్​ ఆఫీసర్లను నియమించింది​. వాటిలో యూసుఫ్​గూడ, మెహదీపట్నం, కార్వాన్​, అంబర్​పేట్​, చాంద్రాయణగుట్ట, చార్మినార్​, రాజేంద్రనగర్​, కుత్బుల్లాపూర్​​ ఉన్నాయి. ఒక్కో చోట 10 నుంచి 20 దాకా.. మొత్తంగా వంద కంటెయిన్​మెంట్​ జోన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏరియాల్లో పనిచేసేందుకు వందల సంఖ్యలో సిబ్బంది అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.