భారత్‌ కరోనా అప్ డేట్.. కొత్త కేసులివే - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ కరోనా అప్ డేట్.. కొత్త కేసులివే

September 21, 2020

ngn

భారత్‌లో కరోనా వైరస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 86,961 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 54,87,581కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,130 మంది కరోనా బాధితులు మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87,882 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,03,299 ఆక్టివ్ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 43,96,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మెజారిటీ ప్రజలు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు మాత్రమే కోవిడ్ క్యూర్ సెంటర్లకు వస్తున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.