దేశంలో 2 లక్షల కరోనా కేసులు.. అయినా నో టెన్షన్: WHO - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 2 లక్షల కరోనా కేసులు.. అయినా నో టెన్షన్: WHO

June 6, 2020

 

WHO

రోజురోజుకు భారత్‌లో కరోనా విజృంభిస్తున్న క్రమంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలా బతుకుతామో ఏమోనని అంటున్నారు. ఈ క్రమంలో భారత్‌లో కరోనా విజృంభిస్తున్న స్థాయిలో లేదని.. అయితే మార్చి నుంచి అమలులో ఉన్న లాక్‌డౌన్ ఎత్తివేయడంతో దాని ముప్పు తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైకేల్ ర్యాన్ వెల్లడించారు. భారత్‌లో కరోనా కేసులు రెట్టింపు కావడానికి ఇప్పుడు మూడు వారాల సమయం పడుతుందని తెలిపారు. భారత్‌లోని ఆర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం వేర్వేరుగా ఉంటోందని చెప్పారు. దక్షిణాసియాలో భారత్‌లోనే కాదు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో జనసాంద్రత భారీగా ఉన్నా కరోనా విజృంభణ మాత్రం లేదని అన్నారు.  అయితే ఆ ప్రమాదం ఏర్పడవచ్చని ఆయన హెచ్చరించారు. 

భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేయడంతోనే కరోనాను అదుపు చేయడం వీలైందనీ.. అయితే ఇతర దేశాల మాదిరిగా లాక్‌డౌన్ సడలించడంతో జనం మళ్లీ ప్రజలు అటూఇటూ తిరుగురతారు కాబట్టి వైరస్ పెరిగే ప్రమాదం ఉందని వాపోయారు. అర్బన్ ఏరియాల్లో జనం రద్దీ, చాలామంది కార్మికులు రోజూ పనికి వెళ్లాల్సిరావడం, భారీ ఎత్తున వలసలు.., ఇవన్నీ భారత్‌లో ప్రత్యేక అంశాలని చెప్పారు. భారత్ వేగంగా ఇటలీని అధిగమించి ప్రపంచంలో ఆరో కరోనా బాధిత దేశంగా మారుతోందని అంచనా వేశారు. ఇదిలావుండగా 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 2 లక్షల కరోనా కేసులు నిర్ధారణ కావడం ఆందోళన చెందాల్సిన అంశం కాదని డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాధన్ అభిప్రాయ పడ్డారు. అయితే వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవలసి ఉందని తెలిపారు.