లాక్‌డౌన్ 4.0 ఎఫెక్ట్.. మారటోరియాన్ని పొడిగించనున్న ఆర్బీఐ! - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ 4.0 ఎఫెక్ట్.. మారటోరియాన్ని పొడిగించనున్న ఆర్బీఐ!

May 18, 2020

rbi

మే 31 వరకు లాక్‌డౌన్‌ 4.0ను కొనసాగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో.. రుణాలపై మారటోరియాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) యోచిస్తున్నట్టు  తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా గృహ, వ్యక్తిగత రుణాలపై ఆర్‌బీఐ మూడునెలల పాటు మారటోరియం ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించడంతో.. మారటోరియాన్ని కూడా ఆర్‌బీఐ మూడు నెలలు పొడిగిస్తుందని భావిస్తున్నామని ఎస్‌బీఐ పరిశోధన స్పష్టంచేసింది. మూడు నెలలు అంటే ఆగస్టు 31, 2020 వరకు రుణాలు చెల్లించనవసరం లేదు. సెప్టెంబరులో రుణం, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రభుత్వరంగ బ్యాంకుకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ కారణంగా వ్యక్తుల, సంస్థల ఆదాయాలు బాగా మందగించాయి. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే వారు రుణాలు చెల్లించలేదు. అందుకే రుణాలపై మరో మూడు నెలలపాటు మారటోరియం విధిస్తే మంచిదని భావిస్తున్నాం’ అని వెల్లడించారు.