మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 2,700కు పైగా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్రలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 2,700కు పైగా కేసులు

June 6, 2020

 

Coronavirus

మహారాష్ట్రలో కరోనా అస్సలు తగ్గనంటోంది. నానాటికి అక్కడ కేసులు పెరుగుతున్నాయి.   ఈ రోజు మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 2,700కు పైగా కొత్త కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,739 కరోనా కేసులు నమోదయ్యాయని.. 120 మంది మరణించారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2,234 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82,968కి చేరింది. వీరిలో 2,969 మంది కరోనాకు బలయ్యారు. 37,390 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 42,609 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుండగా నేడు కరోనా కాటుకు ఇద్దరు పోలీసులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన పోలీసుల సంఖ్య 33కు చేరింది.