Home > Corona Updates > బీఎస్ఎఫ్‌లో కరోనా కలకలం.. మరో 10 మందికి పాజిటివ్

బీఎస్ఎఫ్‌లో కరోనా కలకలం.. మరో 10 మందికి పాజిటివ్

bsf

రెండు రోజుల క్రితం బీఎస్ఎఫ్ (బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌)లో 11 మందికి కరోనా సోకగా.. కేసుల సంఖ్య 78కి చేరింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో మరో 10 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. వారిని కరోనా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 13 మంది జవాన్లు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. కాగా, కేసులు పెరగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో రెండు అంతస్తులు మూసివేసిన విషయం తెలిసిందే. ఇటీవల సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు .

Updated : 17 May 2020 7:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top