శబరిమలలో కలకలం.. భక్తుడికి కరోనా.. - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమలలో కలకలం.. భక్తుడికి కరోనా..

October 19, 2020

Coronavirus positive case in sabarimala.jp

శబరిమలలో కరోనా కలకలం రేపింది. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో యాత్రకు వచ్చిన మిగతా భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన భక్తుడిని తమిళనాడు వాసిగా గుర్తించారు. అతడిని కరోనా కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం శబరిమలకు వచ్చే వారికి మార్గదర్శకాలను విడుదల చేసింది. శబరిమల యాత్రికులు దర్శనం కోసం టైమ్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

దీనికోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు 48 గంటల ముందు యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు చూపించాలి. ఇందులో నెగటివ్ అని తేలిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రతిరోజు కేవలం 250 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా 10 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నవారికి మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అలాగే భక్తులు పంబ నదిలో స్నానాలు చేయడం, అభిషేకాలు చేయడాన్ని నిషేధించారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.