భారత్ లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు… - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు…

June 2, 2020

b vn bn n

కరోనా వైరస్ కేసుల్లో భారత్ మరో మైలు రాయిని దాటింది. ఈరోజు నమోదైన కేసులతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 2 లక్షలు దాటింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో 2,01,009 కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో భారత్ లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేసిన సంగతి తెల్సిందే.

అయితే, కరోనా పుట్టిలు చైనాలో మాత్రం తక్కువ కేసులతోనే కరోనా వైరస్ కట్టడి అయింది. కానీ, మిగతా దేశాల్లో మాత్రం ప్రతాపం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల టాప్ టెన్ దేశాల జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. భారత్ లో 600 కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించారు. ఐదో లాక్ డౌన్ ప్రారంభయ్యే సమయానికి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఐదో లాక్ డౌన్ రెండో రోజు వచ్చే సరికి కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.