అమెరికాలో సెకండ్ వేవ్.. ఒక్కరోజే 94 వేల కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో సెకండ్ వేవ్.. ఒక్కరోజే 94 వేల కేసులు

October 31, 2020

america

యూరప్ లో మొదలైన కరోనా వైరస్ సెకండ్ వేవ్ అమెరికాను తాకింది. అధ్యక్ష ఎన్నికల వేల అమెరికాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 94వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక కేసులు నమోదు కావడం ఇది వరుసగా రెండవ రోజు. గురువారం కూడా 91 వేల కేసులు నమోదు అయ్యాయి. 

సుమారు 21 రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 90 లక్షల పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో అధికారులు అధ్యక్ష ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ర్యాలీలకు హాజరవుతున్న వారికి మాస్క్‌లను అందిస్తున్నారు. టెంపరేచర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. భౌతిక దూరాన్ని తప్పనిసరి చేశారు.