తెలంగాణలో వెయ్యికిపైగా కొత్త కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో వెయ్యికిపైగా కొత్త కరోనా కేసులు

July 1, 2020

ts

తెలంగాణలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా రాష్ట్రంలో ఈరోజు 1,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సగటున రోజుకి వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 881 కేసులు నమోదుకావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కు పెరిగింది.

కరోనా వైరస్ నుంచి కోలుకుని ఈరోజు 788 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా 8,082కి పెరిగింది. ఈరోజు ఏడు కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 267కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 92,797 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 75,440 నెగిటివ్ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.