నిన్న కేరళ నేడు కర్ణాటక..అనూహ్యంగా పెరుగుతోన్న కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

నిన్న కేరళ నేడు కర్ణాటక..అనూహ్యంగా పెరుగుతోన్న కేసులు

May 29, 2020

Coronavirus positive cases increasing in karnataka

ఇటీవల కేరళలో అనూహ్యంగా కరోనా వైరస్ కేసులు పెరిగిన సంగతి తెల్సిందే. గురువారం ఒక్కరోజే కొత్తగా 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కర్ణాటకలో కూడా కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 

గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ కర్ణాటకలో 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కొత్తగా 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు కర్ణాటకలో 2711 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1793 ఆక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 47 మంది కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించారు.