చికిత్స సరిగ్గా లేదని కరోనా పేషంట్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

చికిత్స సరిగ్గా లేదని కరోనా పేషంట్ ఆత్మహత్య

September 24, 2020

Coronavirus positive patient passed away

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున తొంబై వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే రోజుకి వెయ్యి మంది మరణిస్తున్నారు. దేశంలోని ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేక మెజారిటీ ప్రజలు మరణిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఓ కరోనా బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేక ఆత్మహత్య చేసుకుంది. 

ఈ సంఘటన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఉన్న దీన్ దయాల్ ఉపాధ్యాయ జోనల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. గురువారం ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు హాస్పిటల్ అధికారులు తెలిపారు.