60 వేల ఏళ్ల కిందటే కరోనా..నియార్తండల్ మానవుల్లో - MicTv.in - Telugu News
mictv telugu

60 వేల ఏళ్ల కిందటే కరోనా..నియార్తండల్ మానవుల్లో

July 6, 2020

sixty thousand years.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పై ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారి పరిశోధనల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా న్యూజెర్సీలోని ప్రిన్‌స్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి ఓ విస్తుగొలుపే విషయాన్ని వెల్లడించారు.  కరోనా వైరస్ కు లింకున్న డీఎన్‌ఏ భూమిపై 60వేల ఏళ్లకు ముందున్న నియార్తండల్ మానవుల నుంచి మనలో కొనసాగుతున్నట్లు తెలిపారు. 

అరవై వేల ఏళ్ల క్రితం మానవునిలో జరిగిన కరోనా సంతానోత్పత్తి నేటికీ ప్రభావం చూపుతున్నదని జన్యు శాస్త్రవేత్త జాషువా అకీ తెలిపారు. ఈ జీన్‌ స్పాన్‌కు సంబంధించిన మానవ చరిత్ర అస్పష్టంగా ఉందని, నియాండెర్తల్‌ మానువుని క్రోమోజోమ్ మూడులో ఆరు జన్యువులున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. బంగ్లాదేశ్‌లో 63 శాతం మంది ప్రజలు కనీసం ఈ జన్యువుకు సంబంధించిన ఒక కాపీని కలిగి ఉన్నారని వెల్లడించింది. ఇతర దేశాల మానవులలో ఈ జన్యువు అంతగా లేదని గుర్తించింది. కేవలం ఎనిమిది శాతం మంది యురోపియన్లు, నాలుగు శాతం మంది తూర్పు ఆసియన్లలో మాత్రమే ఉన్నట్లు తేల్చింది.