కరోనా వైరస్ బ్రేక్ అవుట్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంకా దానికి వ్యాక్సిన్ రాలేదు. ఈ మహమ్మారిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. చలికాలంలో ఈ వైరస్‌ను అదుపు చేయడం మరింత కష్టమవుతుంది జుర్జెన్ రిచ్ట్ అనే ఆస్ట్రేలియా శాస్త్రవేత్త తెలిపారు.
చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువకాలం జీవించి ఉంటుందన్నారు. ముఖ్యంగా మొబైల్ స్క్రీన్, గాజు పరికరాలు, కరెన్సీ నోట్లపై ఈ వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందన్నారు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్ ఒక రోజు కన్నా ఎక్కువగా జీవించలేడు. కానీ, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే మొబైల్ ఫోన్లు, సూపర్‌మార్కెట్ సెల్ఫ్ సర్వ్ చెక్‌అవుట్‌లు, బ్యాంక్ ఎటిఎంలు, ఎయిర్పోర్ట్ చెక్ఇన్‌ల వద్ద వైరస్ తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే కరెన్సీ నోట్లు ఒకరి చేత నుంచి మరొకరికి మారేకొద్దీ వైరస్ వారందరికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు తెలిపారు.