ఏపీ సచివాలయంలో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్

May 31, 2020

nvbhn

అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వీరిలో సచివాలయంలోని ఓ శాఖలో పనిచేసే ఒకరు, గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్‌ ఆఫీస్ లో పనిచేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 227 మంది సచివాలయ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో బుధవారం అమరావతికి తీసుకొచ్చింది. వారిని తాడేపల్లి సమీపంలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి, కరోనా నిర్ధరణ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. అందరూ గురువారం నుంచి విధులకు హాజరవుతున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వారం పాటు సచివాలయ ఉద్యోగులందరికీ ‘ఇంటి నుంచే పని’ సౌకర్యం కల్పించి, అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఉన్నతాధికారులను కోరారు. కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిన వారిని మాత్రమే విధుల్లోకి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.