అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణలోనే - MicTv.in - Telugu News
mictv telugu

అతి తక్కువ కరోనా పరీక్షలు తెలంగాణలోనే

May 19, 2020

కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 40 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వం తక్కువ కేసులు చేస్తుందని, అందుకే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 652 టెస్టులు చేస్తున్నారని పీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాగా, కేసులు ఎక్కువగా లేకపోవడం వల్లే తక్కువ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. లక్షణాలు లేని వారికి టెస్టులు చేయడం లేదంటోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో చేస్తున్న కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. మే 16 వరకు 23,388 కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో తక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది. ఏప్రిల్ 30 వరకు 19,325 శాంపిళ్లను పరీక్షించామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మే నెల మొదటి రెండు వారాల్లో రోజుకు సగటున 251 కరోనా టెస్టులు చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌‌లో రోజుకు 9 వేల టెస్టులు చేయడం గమనార్హం. ఏపీలో ఇప్పటివరకు 2 లక్షలకు పైగా టెస్టులు చేశారు. కర్ణాటకలో 1.28 లక్షలకుపైగా టెస్టులు చేశారు. కేరళలో 39 వేలకుపైగా కోవిడ్ టెస్టులు చేశారు.