తెలంగాణలో కరోనా పరీక్ష, చికిత్స ఉచితం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా పరీక్ష, చికిత్స ఉచితం

July 15, 2020

Coronavirus treatment free in telangana state

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున వెయ్యి కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కరోనా పరీక్షలు, కరోనా చికిత్సను ఉచితం చేసింది. తొలుత మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలలో ఉచిత టెస్టులు, వైద్యం అందించనున్నారు. 

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది. కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం ఈ టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే కోవిడ్ బాధితులకు ఎలాంటి సందేహాలున్నా 1800 599 4455కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.