అమెరికన్లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్..ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికన్లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్..ట్రంప్

September 17, 2020

 

bvg

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, రష్యా ముందంజలో ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అక్టోబర్ నెలకల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. అలాగే అమెరికా పౌరులందరికీ ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలోని పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు. 

ఈ మేరకు అమెరికా హెల్త్‌ అండ్‌ హూమన్‌ సర్వీసెస్‌, యూఎస్‌ డిఫెన్స్‌ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని ట్రంప్‌ ప్రభుత్వంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన కరోనా ప్రశ్నలతోనే విపక్షాలు ట్రంప్‌ను నిలదీస్తున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతూన్నాయి. ఇప్పటి వరకు 68,25,448 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 2,01,266 మంది మరణించారు.