ఏందా కార్పోరేట్ బలుపు.. కోర్టు పిలిచినా రారా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఏందా కార్పోరేట్ బలుపు.. కోర్టు పిలిచినా రారా ?

August 7, 2017

పొట్టిగున్న వారిని పొడుగు చేస్తాం, మా దగ్గర నాణ్యమైన వైద్యం లభిస్తుంది, మీ ప్రాణాలకు మా గ్యారెంటీ అంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న హంగామా ఫీట్లు అన్నీ ఇన్నీ కావు ?? అప్పులు సప్పులు చేసి డబ్బులు పోసినా, వారి మనుషుల్ని కాపాడుకోలేకపోతున్నారు ? ఇదొక కార్పోరేట్ దోపిడీ. అయితే ఇలాంటి ప్రయివేట్ హాస్పిటల్స్ పై దాఖలైన పిటిషన్ పై, హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కోర్టుకు కౌంటర్ దాఖలు చేసుకునేందుకు హాస్పటల్స్ కు వారం గడువును ఇచ్చింది దర్మాసనం. కార్పోరేట్ ఆస్పత్రుల తీరుపై హైకోర్టు మందలించింది కూడా. ఆరు నెలల తర్వాత విచారణకు వచ్చిన ఈ పిల్ పై వివరణిచ్చేందుకు ఏపి సర్కార్ తరుపున అడ్వకేట్ హాజరు కాలేదు.

గ్రాఫిక్ కార్పోరేట్ ఆసుపత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్

పిల్ నెంబర్ 98..2016

కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన తౌటం సునీత అనే మహిళకు

క్యాన్సర్ ఉన్నా గుర్తించకుండా 3 ఏళ్ల పాటు నాసిరకం వైద్యం

చేసి ఆమె ప్రాణాలను బలిగొన్నారు. గ్లోబల్ ట్రీట్ మెంట్ తర్వాత ఇంకా కోలుకోని నిఖిల్ రెడ్డి అలా బెడ్డుకే అంకితమయ్యాడు. చేతికొచ్చిన కొడుకు ఆచేతనంగా బెడ్డు మీద పడివుండటం ఏ తల్లిదండ్రులకైనా మింగుడు పడని బాధే ?

డాక్టర్ అంటే దేవుడు, దవాఖానా అంటే గుడితో సమానం అంటారు. రోగం లేకుండానే వైద్యం చేసేస్తూ డబ్బులు లాగుతున్న ఇలాంటి ప్రైవేట్ డాక్టర్లను ఏమనాలో అర్థంకాని పరిస్థితి ??

అపెండెక్స్ ఆపరేషన్లు అవసరం లేకున్నా చేస్తున్నారు

వైద్యం అందించకుండానే ఆరోగ్య శ్రీ నిధులకు కూడా గండి కొడుతున్న డాక్టర్లను ఏ బిరుదదుతో వ్యాఖ్యానించాలో ?

ప్రైవేట్ ఆస్పత్రులు

కౌంటర్ కి మరో వారం గడువు కోరాయి. ఇటీవల తప్పుడు ఆపరేషన్లు చేసిన 7గురు డాక్టర్ల పై వేటు వేసింది ఎమ్సీఐ.

కార్పోరేట్ హాస్పిటల్స్ అక్రమాలు, దోపిడీ, తప్పుడు ఆఫరేషన్ల పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై మరోసారి హైకోర్ట్ విచారణ చేపట్టింది. తెలంగాణా, ఆంద్రప్రదేశ్ లలో జనాల ప్రాణాలతో ప్రైవేట్ ఆసుపత్రులు చెలగాటమాడుతున్నాయని, ఆరోగ్యశ్రీ నిధులను ఆస్పత్రులు ఇస్టానుసారంగా మెక్కేశాయని నరేందర్ పిటీషన్ దాఖలు చేసాడు.

ఐతే.. ఇవాళ ఈ పిల్ పై మరోసారి విచారణకు రాగా, కౌంటర్ దాఖలు చేయడానికి కావల్సినంత టైం ఇచ్చిన దాటవేట కనబర్చిన కార్పోరేట్ ఆస్పత్రులపై మందలించిన బెంచ్, జస్టిస్ వి రామసుభ్రమణ్యం,జస్టిస్ సి రజినీలతో కూడిన దర్మాసనం మరోవారం మాత్రమే గడువు ఇష్తున్నట్లు తెలిపింది. ఇక, ప్రభుత్వం తరుపున హాజరైన అడ్వకేట్ కౌంటర్ దాఖలు చేసేందుకు రెండువారాల టైంకావాలని కోరడంతో దర్మాసనం రెండువారాలు ఇస్తూ కోర్టువాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్ట్ పుల్ బెంచ్..గతంలో కౌంటర్ దాఖలు చేయాలని గ్లోబల్ హాస్పిటల్ ,కేర్ ఆసుపత్రులతో పాటు పలు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది.

పిటీషనర్ తరుపున వాదిస్తున్న అడ్వకేట్ ఆర్జున్ కుమార్.. గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి హైట్ పెంచుతామని చెప్పి మోసగించారనీ, అదే విధంగా కేర్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ అనిల్ కేర్ కేర్ లెస్ ట్రీట్ మెంటుతో సునీత అనే పేషంట్ కు క్యాన్సర్ ను గుర్తించడం లో విఫలమై చనిపోయేందుకు కారణమైందని కోర్టుకు విన్నవించారు. ఈ విచారణకు ఏపి సర్కార్ తరుపున కూడా ప్రభుత్వ న్యాయవాది రావాల్సివున్నా హాజరు కాకపోగా, తెలంగాణ నుంచి అడ్వకేట్ హాజరయ్యారు.

ఒక పక్క ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలు, వైద్యుల నిర్లక్ష్యంపై తెలంగాణా మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపి 7 గురు వైద్యులపై సస్పెండ్ చేయడం, నకిలీ బ్లడ్ ఎక్కించడం లాంటి సంఘటనతో 17 ఏళ్ల వైష్ణవి చేయి కోల్పోవడం వంటి సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటంపై కార్పేరేట్ మోసాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.