కార్పొరేట్ స్థాయిలో దొంగతనాల కంపెనీ.. పోలీసుల షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

కార్పొరేట్ స్థాయిలో దొంగతనాల కంపెనీ.. పోలీసుల షాక్

March 11, 2022

24

దొంగలకు ఉద్యోగాలిచ్చి నెల నెలా కార్పొరేట్ కంపెనీల స్థాయిలో జీతాలిస్తూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇర్ఫాన్, మహ్మద్ మొహిసిన్ అనే వ్యక్తులు ఈ దందాను మొదలుపెట్టారు. ఐదుగురు యువకులను రిక్రూట్ చేసుకొని వారితో రాత్రిపూట బైక్ దొంగతనాలు చేయిస్తున్నారు. పగలు వాటి విడిభాగాలను నగరంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేసుకుంటారు. చోరీలు చేసినందుకు గానూ ఒక్కొక్కరికి నెలకు 30 వేల రూపాయలు జీతంగా ఇచ్చేవారు. అంతేకాకుండా పనిని బట్టి బోనస్‌లు ఇచ్చేవారు. ఇటీవల ఈ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వారి వద్ద నుంచి 90 బైక్ ఇంజిన్లను, వందలాది బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు కోట్లాది రూపాయల బిజినెస్ చేసినట్టు పోలీసులు తెలిపారు.