కార్పొరేటర్ ని చంపింది వీళ్ళే ! - MicTv.in - Telugu News
mictv telugu

కార్పొరేటర్ ని చంపింది వీళ్ళే !

July 13, 2017

వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని టిఆర్ ఎస్ కార్పోరేటర్ అనిశెట్టి మురళిని అతి దారుణంగా వేట కొడవళ్ళతో నరికి చంపిన హంతకులు ముగ్గురు వరంగల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వీళ్లల్లో విక్రమ్ ( మధ్యలో వ్యక్తి ), చిరంజీవి ( ఆటో డ్రైవర్, లెఫ్ట్ ), వరుణ్ ( ల్యాబ్ టెక్నీషియన్, రైట్ ) లుగా పోలీసులు నిర్ధారించారు.  టీడిపి నుండి ప్రాణ రక్షణ కోసమే అధికార పార్టీలోకి చేరినట్టు తెలుస్తోంది.

పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ హత్య వెనకాలు వున్నది ఎవరు ? ఎందుకు చంపవలసి వచ్చింది ? అనే కోణంలో పోలీసు యంత్రాంగం ముమ్మరంగా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో ప్రధానంగా రాజకీయ కోణం కూడా దాగి వున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.