అవినీతి అక్కయ్య.. 6 లక్షలు పుచ్చుకుంటూ దొరికేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

అవినీతి అక్కయ్య.. 6 లక్షలు పుచ్చుకుంటూ దొరికేసింది..

January 20, 2020

Corrupted officer.

దురాశ దు:ఖానికి చేటు అంటారు. దురాశే కాదు, అత్యాశ కూడా కొంపముంచుతుంది. కలెక్టరేట్‌లో ఉద్యోగం వెలగబడుతున్న ఓ మహిళా అధికారి ఒక సంతకం గిలకడానికి ఏకంగా రూ. లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయింది. మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో భూరికార్డులు ఏవోగా పనిచేస్తున్న ప్రశాంతి వద్దకు ఓ భూమి దరఖాస్తు వచ్చింది. తన అధీనంలో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని తాడేపల్లికి చెందిన రామలింగేశ్వర రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. 

అయితే తనకు రూ. 6 లక్షలు ఇస్తేనే పని పూర్తి చేస్తానని ప్రశాంతి ఆఫర్ ఇచ్చింది. అంత ఇచ్చుకోలేనని బాధితుడు వాపోయినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు రామలింగారెడ్డి రూ. 6 లక్షలను  ప్రశాంతి ఇస్తుండగా ఏసీబీ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.