అవినీతి అధికారి కుక్క ఏం చేసిందటే.. - MicTv.in - Telugu News
mictv telugu

అవినీతి అధికారి కుక్క ఏం చేసిందటే..

November 18, 2017

కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. యజమాని మంచివాడైనా, చెడ్డవాడైనా అవి మొక్కవోని విశ్వాసం చూపుతాయి. అయితే అలాంటి కుక్కలు ఆదాయపన్ను అధికారులకు చుక్కలు చూపించాయి. అవినీతితో కోట్లకు పడగలెత్తిన ఏపీ ల్యాండ్ రికార్డుల అధికారి గేదెల లక్ష్మీ గణేశ్వరావు ఇంట్లో ఈ దారుణం జరిగింది. అవినీతి కేసులో ఇదివరకే సస్పెండైన రావు ఆస్తుల వివరాలు రాబట్టడానికి ఐటీ అధికారులు శనివారం విశాఖపట్నంలోని ఆయన ఇంటిపై దాడి చేశారు.

వారి రాకను పసిగట్టిన రావు.. వెంటనే తన పెంపుడు కుక్కను వారిపైకి ఉసిగొల్పాడు. అది ఆయనగారిపై విశ్వాసంతో అధికారులపై ఉరికింది. వారు భయంతో పరుగులు తీశారు. రావు.. ఇంట్లోపలి వెళ్లి భద్రంగా తలుపు వేసుకున్నాడు. కుక్కకు భయపడిన పారిపోయిన అధికారులు చేయాల్సిన పని చేశారు. పోలీసులకు విషయం చెప్పి వారి సాయం తీసుకున్నారు. పోలీసుల సాయంతో రావుగారి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు.

కేజీ బంగారు 4 కెజీ వెండి, పదుల సంఖ్య ఇళ్లు, ప్లాట్ల దస్తావేజులు సోదాల్లో బయటపడ్డాయి. గణేశ్వరరావు విజయనగరం జిల్లాలో సర్వే విభాగంలో సర్వేయర్‌గా పనిచేశాడు. భూమి రికార్డులను భారీ స్థాయిలో ట్యాంపర్ చేసి అక్రమార్కుల నుంచి లక్షల్లో లంచాలు తీసుకున్నాడు. ఇదివరకే అతని బంధువులు, స్నేహితులపై ఇళ్లపై ఐటీ దాడులు సాగాయి.