ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్క్ ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్క్ ఇదే.. 

August 10, 2020

Costly face mask in the world.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయిన సంగతి తెల్సిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా మాస్క్, శానిటైజర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్టు వ్యాపారస్తులు మాస్కులను తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీలు కూడా మాస్కుల తయారీలోకి దిగాయి. కొత్త కొత్త డిజైనర్ మాస్కులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ధనవంతులు తమ అభిరుచులకు తగ్గట్టుగా అత్యంత ఖరీదైన మాస్కులను ఆర్డర్లపై తయారు చేయించుకుంటున్నారు. 

తాజగా అమెరికాలో ఉంటున్న ఓ చైనా వ్యాపారవేత్త తన ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని భావించాడు. అందుకోసం ఇజ్రాయెల్ లోని జెరూసలేంలో ఉన్న ఓ ఆభరణాల సంస్థలో ఆర్డర్ చేశాడు. ఎన్ 99 ఫిల్టర్లు, బంగారం, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. దీని ఖరీదు సుమారు రూ. 11.2 కోట్లని జ్యూవెలరీ సంస్థ తెలిపింది. ఈ మాస్క్ ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేస్తున్నామని, మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని జ్యులరీ సంస్థ వాళ్ళు వివరించారు.