కొద్ది రోజుల క్రితం గనుల ఘనుడు గాలి జనార్థన్‌రెడ్డి కుమార్తె వివాహం ఎంత వైభవంగా జరిగిందో చూశాం. ఈ పెళ్లి టోటల్ ఇండియన్ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కేసింది. కొన్ని కోట్ల రూపాయలను గాలి మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఇప్పుడు గాలి కూతురు పెళ్లికి కాస్త అటూ ఇటూగానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో ఓ భారీ వివాహం జరుగుతోంది.
ఈ నెల 23 న హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగే కల్యాణ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే మతి పోతోంది. ఇంతకు ఈ పెళ్లి ఎవరిదో కాదు. ఎన్ టీవీ ఛానెల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి కుమార్తెది.
ఈ పెళ్లికోసం దేశంలోని ప్రముఖ వ్యక్తులకి అందించే ఒక్కో శుభలేఖ ఖరీదు లక్షన్నర దాకా వుంటుందట. ఇలాంటి కార్డులు 250 దాకా పంచుతున్నట్టు తెలుస్తోంది.
ఈ పెళ్లి కార్డుతో పాటు పట్టు చీర, పట్టు పంచె, చిన్నపాటి వెండి, బంగారు వస్తువులు కలిపి పంచుతున్నారట. ఈ కార్డులు వీవీఐపీలకు మాత్రమే అట.
ఇక విఐపీల కోసం లక్ష రూపాయల విలువైన కార్డులు పంచారట. ఇక మామూలు వారి కోసం పంచిన శుభలేఖలు ఖరీదు సైతం కొన్ని వందల రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఎన్ టీవీ చౌదరి కుమార్తె పెళ్లి ఓ వ్యాపార కుటుంబానికి చెందిన వరుడితో జరగనుంది. ఇక అల్లుడికి చౌదరి ఇచ్చే కట్నం ఎన్ని కోట్లో కూడా లెక్కే లేదంటున్నారు. చౌదరి తన అల్లుడి స్థాయికి తగినట్టు ఓ రూ. 50 కోట్ల విలువైన చిన్న విమానం కానుకగా ఇస్తున్నారట.
తెలుగు రాష్ట్రాల్లో విమానం ఇచ్చే స్థాయి పెళ్లి అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారో కదా. ఈ పెళ్ళికి దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు చాలా మంది హాజరు అయ్యే అవకాశం ఉందట. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎదురయ్యే ట్రాఫిక్, భద్రత సమస్యల కోణంలో ఆలోచించి వివాహ వేదికని శంషాబాద్‌లో నిశ్చయించారట. మరి ఈ కాస్ట్లీ పెళ్లికి సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి ?