CoStly Telangana..Land To MLAs
mictv telugu

తెలంగాణలో అన్ని కాస్ట్లీయే…!

October 29, 2022

CoStly Telangana..Land To MLAs

ఏపీ విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ట్యాగ్ లైన్ రన్ అవుతోంది. అప్పులెన్ని పెరిగినా తెలంగాణ తగ్గేదేలే.. ఇక్కడ అన్ని కాస్ట్లీయే.భూముల నుంచి ఎమ్మెల్యేలదాకా. భూములు లక్షల్లో,ఎమ్మెల్యేలు కోట్లలో పలుకుతున్నారు. సరే వాళ్లు అమ్ముడుపోలేదనుకోండి…భవిష్యత్ తరాల లీడర్లకు మాత్రం రేట్ ఫిక్స్ చేశారు. అమ్ముడుపోతే అంతే రేటు లేదా అంతకుమించి…ఎవరూ తగ్గరు కదా. ఓ రేటు ఫిక్స్ అయిందంటే పెరగడం తప్ప తగ్గడం వుండదు. ఏ విషయంలో చూసినా ఇలాంటి పరిస్థితే.

భూములు లక్షల్లో…

తెలంగాణ వచ్చాక భూముల ధరలు అమాంతం పెరిగాయి. వేలలో వున్నవి లక్షల్లో పలికాయి. లక్షల్లో ఉన్న రేట్లు కోట్లకు చేరాయి. సిటీ నుంచి పల్లెదాకా ఇంతే. ఏ గ్రామంలోనైనా ఎకరా 10లక్షలపైనే ధర వుంది. మంచి భూములైతే అరకోటి నుంచి కోటికి పైగా పలుకుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూముల విలువ పెంచినప్పుడు రేట్లు మరింత పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ భూమ్ ఊహించలేనంతగా ఊపందుకుంది.

ఎమ్మెల్యేలు కోట్లల్లో…

ఫామ్‌హౌజ్ డీల్ పాలిటిక్స్ దిశను మార్చబోతోంది. పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఎమ్మెల్యే రేటు కోట్లల్లో పలికింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు బ్రోకర్లు ఎరవేశారు..కానీ వాళ్లు అమ్ముడుపోలేదు. రికార్డులతో సహా కొనుగోళ్ల వ్యవహారాన్ని బయటపెట్టారు. వచ్చిన బ్రోకర్లే ఎవరికెంత రేటో చెప్పేశారు.ఎమ్మెల్యే కనీస ధరను నిర్ణయించేశారు. అమ్ముడుపోతే భవిష్యత్‌లో ఇంతకు తగ్గొద్దంటూ చెప్పకనే చెప్పినట్లు బేరసారాల తతాంగం సాగింది. వందరూపాయలు,యాభై రూపాయలు అంటూ సంకేత పదాలతో ధర డిసైడ్ చేశారు.వారి భాషలో వంద, యాభై అంటే తెలుసు కదా..వందకోట్లు,యాభైకోట్లు అని.

గతంలో ఇలా ఉండేది కాదు

ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పార్టీలు ఫిరాయించారు. వారిపై ఆరోపణలు వచ్చాయి. 5 కోట్లకు మించి ఇచ్చేవారు కాదు. అదీ సర్కార్ సంక్షోభ సమయంలో వున్నప్పుడు మాత్రమే ఇలాంటి వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా అరుదుగా జరిగాయి. అవసరమైన ప్రజాప్రతినిధులు వరకే ఎంతో కొంతో ఇచ్చి మేనేజ్ చేసేవారు. మహా అయితే ఐదుకోట్లలోపే డీల్ ముగించేవారు. ఇంకొందరైతే నియోజక వర్గ అభివృద్ధికి ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఒప్పించేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. బ్రోకర్లే రేటు ఫిక్స్ చేసేస్తున్నారు. సంతలో కూరగాయల్లా అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఐదు,పదికోట్లు కాదు ఏకంగా యాభై,వందకోట్లు. ముగ్గురు,నలుగురుకాదు..ఎంతమంది వచ్చినా సరే. పైన మాట్లాడేస్తాం..తీసేసుకుంటాం..భద్రత భరోసా ఇస్తామంటూ రామచంద్రభారతి, నందు, సింహియాజి ఆడియోల్లో వినిపించింది. అంటే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంత కాస్లీయో చూడండి.

కోట్లకు నేపథ్యం ఇదే

టీఎఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వలబాలరాజు,రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డిని బ్రోకర్లు రామచంద్రభారతి, నందు, సింహయాజులు కలిశారు. పార్టీ మారితే కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. మొహనాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో డీల్ చేసేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. డీల్‌కు ముందు ముగ్గురు మాట్లాడిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఈ ఆడియోల్లో కొనబోయే ఎమ్మెల్యేల రేట్లను బ్రేకర్లే ఫిక్స్ చేశారు.