ఆల్ టైం గరిష్టానికి పత్తి ధర.. క్వింటాకు రూ. 14 వేలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆల్ టైం గరిష్టానికి పత్తి ధర.. క్వింటాకు రూ. 14 వేలు

May 17, 2022

తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి ధర ఈ ఏడాది రైతుల ఇంట కాసులు కురిపిస్తోంది. గతేడాది అక్టోబరులో 5 వేల ధర ఉండగా, తర్వాత క్రమ క్రమంగా పెరుగుతూ మార్చి నాటికి 10 వేలకు పెరిగింది. అయినా అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో ఏప్రిల్ నాటికి క్వింటా పత్తి రూ. 12 వేలకు చేరింది. తాజాగా ఆ రికార్డు కూడా బద్దలయింది. మంగళవారం ఎనుమాముల మార్కెట్‌లో ఓ ట్రేడింగ్ కంపెనీ రైతు వద్ద నుంచి ఆల్ టైం రికార్డు ధర రూ. 14 వేలకు కొనుగోలు చేసింది. ఈ రేటును చూసిన రైతులు వచ్చే ఏడాది భారీగా పత్తి సాగు చేస్తారని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం కల్తీ విత్తనాలను అరికట్టి ఎరువులు సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకుంటే ఈ సారి తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.