దాగుడు మూతలు ఆడుతున్న పాపపై పులి దాడి - MicTv.in - Telugu News
mictv telugu

దాగుడు మూతలు ఆడుతున్న పాపపై పులి దాడి

June 1, 2022

చిన్నపిల్లలకు దాగుడు మూతలంటే చాలా ఇష్టం. ఇళ్లలో ఫర్వాలేదు గాని బయట ఈ ఆట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలమీదికి వచ్చే ఘోరాలు జరిగే అవకాశముంది దోబూచులు ఆడుతున్న ఓ చిన్నారిపై పులి దాడి చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలోని స్టీవెన్స్ కౌంటీ అడవుల్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. లిల్లీ క్రిజనివస్కీ అనే తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం విహారయాత్రంలో బంధువుల పిల్లలతో కలసి పొదల్లో దాగుడు మూతలు ఆడుతుండా కూగర్ జాతికి చెందిన పులి దాది చేసింది. తీవ్ర గాయాలతో లిల్లీ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను విమానంలో వెంటేనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోమాలోకి వెళ్లిన లిల్లీకి కొన్ని గంటల పాటు సర్జరీల చేసి ఐసీయూకి మార్చారు. దాడి చేసిన పులిని లిల్లీ బంధువులు కాల్చి చంపారు.