మావాడు అమెరికా పోతున్నాడు.. విచారణకు రాలేను.. శివాజీ - MicTv.in - Telugu News
mictv telugu

మావాడు అమెరికా పోతున్నాడు.. విచారణకు రాలేను.. శివాజీ

July 11, 2019

Shivaji emailed to police.

టీవీ9 వాటాల కోనుగోలు కేసులో సినీ నటుడు శివాజీ ముఖం చాటేయగా, వారం క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం ఆయన విచారణకు హాజరు కావాల్సివుంది. అయితే తాను విచారణకు హాజరు కాలేనని పోలీసులకు మెయిల్ ద్వారా తెలిపారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు. 

టీవీ9లో వాటాల కొనుగోలు కేసులో అలంద మీడియా ఫిర్యాదు మేరకు శివాజీని విచారణకు హాజరు కావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు పంపారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో పోలీసులు ఆయనపై లుక్‌ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన గత వారం అమెరికాకు వెళ్లే ప్రయత్నంలో హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల కంటబడ్డారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని శివాజీని అరెస్టు చేశారు. 

అలంద మీడియా కేసులో గురువారం జరిగే విచారణకు హాజరు కాలేనని సినీ నటుడు శివాజీ తెలిపారు. గురువారం సైబరాబాద్‌ పోలీసుల ఎదుట విచారణ జరగనున్న నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నట్టు మెయిల్‌ ద్వారా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున హాజరు కాలేనని పేర్కొన్నారు. అలంద మీడియా ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో శివాజీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా ఇచ్చారు. వారం క్రితం శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఎల్‌వోసీ ఉండటంతో పోలీసులు అడ్డుకున్నారు.