స్వామిగౌడ్ డిశ్చార్జి.. డ్రామా అవసరం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

స్వామిగౌడ్ డిశ్చార్జి.. డ్రామా అవసరం లేదు

March 15, 2018

గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కాసేపటి కిందట ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి  వైద్యులు ఆయనకు సూచించారు.డిశ్చార్జి తర్వాత ఆయనను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. కాగా, తన కంటికి నిజంగానే గాయమైందని, డ్రామాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్వామిగౌడ్ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. చట్ట సభల సభ్యులు నిబంధనలు పాటిస్తూ, హుందాగా వ్యవహరించాలని కోరారు. వ్యక్తులను గౌరవించకపోయినా రాజ్యాంగాన్ని గౌరవించాలని, అన్నారు. తనకు సరోజినీ ఆస్పత్రి వైద్యుల మెరుగైన చికిత్సను అందించారన్నారు.