Counting of presidential votes today..results at 4 o'clock
mictv telugu

నేడే రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు..4 గంటలకు ఫలితాలు

July 21, 2022

భారతదేశ 16వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ నియామాకం కానున్నారా? లేక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నియామాకం కానున్నారా? అనే విషయం ఈరోజు సాయంత్రం 4 గంటలకు తేలనుంది. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి ఈ నెల 18న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపును నేడు 11 గంటలకు అధికారులు మొదలుపెట్టనున్నారు. మొదటగా ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కించనున్నారు.

అంతేకాదు, ఇంగ్లిష్‌ అక్షర క్రమంలో ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం ఓట్ల కౌంటింగ్‌ అనంతరం తుది ఫలితాలను ప్రకటిస్తారు. సుమారుగా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింగ్‌ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. ఆనవాయితీ ప్రకారం.. నూతన దేశాధినేత 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో అటు ఎన్డీఏ నాయకులు ఇటు విపక్షాలు నాయకులు ఎవరు దేశ 16వ రాష్ట్రపతిగా ఎన్నిక అవుతారోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్టప్రతిగా ఎవరు నియమితులు అవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.