ఆయన ఆస్తి రూ. 1,107 కోట్లు.. పడింది 1,556 ఓట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన ఆస్తి రూ. 1,107 కోట్లు.. పడింది 1,556 ఓట్లు

May 25, 2019

మన దేశంలో ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్ కొనుక్కోవడం నుంచి ఓట్లను కొనుక్కోవడం వరకూ అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే ధనికులే ఎక్కువగా పోటీ చేస్తుంటారు. కానీ కొన్ని చోట్ల డబ్బూగిబ్బూ ఏమాత్రం పనిచేయదు. నోట్లను కాకుండా కేవలం అభ్యర్థి గుణగణాలను చూసి కూడా జనం ఓట్లేస్తుంటారు.

country's richest candidate Ramesh Kumar Sharma, who fought independently from Bihar, lost his deposit gets only 1,556 votes.

సార్వత్రిక ఎన్నికల్లో అలాంటి అరుదైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బిహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి రమేశ్ కుమార్ శర్మ అనే అభ్యర్థి బరిలోకి దిగాడు. తనకు ఏకంగా రూ.1,107 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివరించాడు. లోక్ సభ అభ్యర్థుల్లో ఆయన అత్యంత ధనవంతుడు. అంత ఆస్తి ఉన్న అభ్యర్థులు బీజీపీ, కాంగ్రెస్ వంటి బడా పార్టీల నుంచి పోటీ చేస్తుంటాడు. కానీ మనోడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. తనకు డబ్బులు చాలా ఉన్నాయని, తనను గెలిస్తే వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆయన హామీలను జనం నమ్మలేదు. కేవలం 1,556 ఓట్లతో ఆయనను గౌరవించి డిపాజిట్ కూడా దక్కకుండా చేసి, బీజేపీ అభ్యర్థి రాంకృపాల్ యాదవ్‌ను గెలిపిచారు.   

శర్మనే కాకుండా కాకుండా పలువురు కుబేరులు కూడా ఎన్నికల్లో మట్టికరిచారు. లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన వారిలో టాప్ 10లో ఐదుగురే గెలిచారు. ఓడిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి(రూ.895 కోట్లు), జ్యోతిరాదిత్య సింధియా(రూ. 374 కోట్లు), ప్రసాద్ వీర్ పొట్లూరి(రూ. 347 కోట్లు, విజయవాడ) తదితరులు ఉన్నారు.