చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు ఓ దంపతులు. ఐదున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి, చివరకి కుచ్చుటోపీ పెట్టారు. మోసం చచేసిన ఆ జంటను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు వారు ఆందోళన దిగారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు, అతని భార్య దివ్య… 6 సంవత్సరాల నుంచి చిట్టి వ్యాపారం చేస్తున్నారు. చిట్టీలు పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు 11 నెలల క్రితం శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో 11 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్న దంపతులను బుధవారం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువుల కోసం… మధు వద్ద 50 వేల నుంచి ఐదు లక్షల వరకు చిట్టీలు వేసినట్లు బాధితులు తెలిపారు. చిట్టీ గడువు పూర్తి అయిన్నప్పటికీ… డబ్బులు చెల్లించకుండా అధిక వడ్డీ ఆశ చూపి ఆ డబ్బులను కూడా స్వాహా చేశారని బాధితులు వాపోయారు.