రిమ్మెక్కిన జంట.. పోలీస్ స్టేషన్ ఎదుటే శృంగారం - MicTv.in - Telugu News
mictv telugu

రిమ్మెక్కిన జంట.. పోలీస్ స్టేషన్ ఎదుటే శృంగారం

May 7, 2019

రిమ్మెక్కిన జంట బరితెగించింది. ఫూటుగా తాగిన మైకం వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా చేసింది. ఇంకే రోడ్డు మీదే బట్టలు ఊడదీసుకుని పచ్చిగా శృంగారంలో పాల్గొన్నారు. అదీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే. ఇది చూసిన పోలీసులు వూరుకుంటారా.. పట్టుకుని వాళ్ల రిమ్మ దించడానికి కటకటాల్లోకి నెట్టారు. విచిత్రమైన ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

గ్యారీ హిల్, క్రిస్టల్ రిలేషన్‌లో వున్నారు. బయటకు వెళ్లి బాగా మందు కొట్టారు. తాగిన మైకంలో  రోడ్డుమీద తూలుతూనే ఇంటికి బయలుదేరారు. ఇంతలో వాళ్లకు పోలీస్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ దగ్గరికి రాగానే ఇల్లు వచ్చినట్టు అనిపించింది. ఇంకే బట్టలు విప్పేసి నడి రోడ్డుమీద శృంగారంలో పాల్గొనసాగారు. చుట్టుపక్కల జనాలు వాళ్ల పిచ్చి చేష్టలను చూసి ఛీఛీ ఇదేం బరితెగింపు అనుకుని కళ్లు మూసుకుని వెళ్లిపోసాగారు. పోలీసులు వాళ్లను చూసి షాకయ్యారు. వెంటనే వారి చిత్తకార్తె కామాన్ని ఆపి అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో.. అందులోనూ ఓ పోలీస్ స్టేషన్ ముందు ఇలా బరితెగించినందుకు కేసు నమోదు చేశారు. శృతిమించి తాగడంతో ఆమె  పరిస్థితి కాస్త విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అతణ్ని జైల్లో పెట్టారు.