స్టార్ బక్స్ కాఫీ ఖరీదైనదే కావచ్చు. కానీ ఒక జంటకు రెండు కప్పుల కాఫీ కోసం వారు 4,456.27 డాలర్లు కట్టారు. అంటే సుమారు 3.6 లక్షలకు పైగా చెల్లించారు. దాని గురించి ఇప్పుడు స్టార్ బక్స్ కూడా స్పందించింది.
జెస్సీ ఓడెల్ అనే వ్యక్తి భార్యతో కలిసి తుల్సా స్టార్ బక్స్ అవుట్ లెట్ కి వెళ్లారు. జనవరి 7న వెళ్లిన వాళ్లు అతని కోసం వెంటి కారామెల్ ఫ్రాప్పూచినోను, భార్య కోసం.. ఒక ఐస్డ్ అమెరికన్నో ఆర్డర్ చేశాడు. మామూలుగా అయితే ఈ రెండింటీకి కలిపి 10 డాలర్లు అంటే 830 రూపాయలు బిల్లు వేయాలి. కానీ వారు ఏకంగా 3.6 లక్షలు కట్టించుకున్నారు. వారు ఇది గమనించుకోలేదు.
చూడలేదు..
మామూలుగా బిల్లు కట్టిన వెంటనే ఎవరైనా చూసుకోవాలి. కానీ ఈ జంట కాఫీ రసీదుని చూడలేదు. ఖాతా నుంచి ఎంత డబ్బు కట్ అయిందో అర్థం కాలేదు. ఒక మాల్ లో క్రెడిట్ కార్డ్ తిరస్కరించబడినప్పుడు తప్పుడు లెక్కను అతని భార్య మొదట గమనించింది. దీంతో వెంటనే కాఫీ అవుట్ లెట్ ను సంప్రదించారు. నివేదిక ప్రకారం.. స్టార్ బక్స్ అధికారులు నష్టాన్ని పూడ్చేందుకు వారికి చెక్కులను పంపారు. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి. దీనివల్ల ఆ కుటుంబం తమ పర్యటనను రద్దు చేసుకున్నది. ‘మేం వారి కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ ను ఆ రోజు బహుశా 30 నుంచి 40 సార్లు సంప్రదించాం’ అని జెస్సీ తెలిపాడు. పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కాఫీ అవుట్ లెట్ పరిస్థితి గురించి తెలుసని స్టార్ బక్స్ ప్రతినిధి పోర్టల్ కి తెలిపారు. వాళ్లు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారిస్తానన్నారు.
ఇలాంటిదే..
ఇదే సందర్భంలో… 35 యేండ్ల యూకే వ్యక్తి ఎఫెస్ కబాబ్ కిచెన్ లో సాధారణ వెజ్జీ బర్గర్, చిప్స్ కోసం ఏకంగా 66,000రూపాయలు చెల్లించాడు. టోబి అనే వ్యక్తి రాత్రి 11 గంటల సమయంలో కలుసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆకలి అనిపించి అవుట్ లెట్ వద్ద ఆగాడు. తిన్న తర్వాత బిల్లు చెల్లించి వెళ్లిపోయాడు. కానీ తర్వాత కొంతకాలానికి చూస్తే తన అకౌంట్ లో తక్కువ ఉన్నదని గమనించాడు. కానీ ఇప్పటివరకు తన మిగిలిన డబ్బు తిరిగి రాలేదు.