టోల్‌గేట్ రేకులు ఎగిరిపడి రైతు దంపతులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

టోల్‌గేట్ రేకులు ఎగిరిపడి రైతు దంపతులు మృతి

May 16, 2020

nbhdsf

తెలంగాణలో పలు జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం గాలివాననలు బీభత్సం సృష్టించాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం  మున్ననూర్‌లో ఇనుప రేకులు ఎగిరిపడి రైతు దంపతులు మృతిచెందారు. మున్ననూర్ వద్ద టోల్ గేట్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైపులు రేకులు పెనుగాలికి విరిగిపడ్డాయి. రేకులు కొద్ది దూరంలో వడ్లు  ఆరబెడుతున్న ప్రాంతంలో పడిపోయాయి. వడ్లకు కాపలాగా ఉన్న కృష్ణయ్య, పుష్ప దంపతులపై పడిపోవడంతో వాటి పదునుకు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.