అమెరికాలో ఘోరం.. హైదరాబాద్ దంపతుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ఘోరం.. హైదరాబాద్ దంపతుల మృతి

February 25, 2020

 

Couple

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన  దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన గవిని రాజా(41), ఆవుల దివ్య(34) తమ 8 ఏళ్ల కొడుకుతో, మరో స్నేహితుడు ప్రేమనాథ్ రామనాథన్‌తో కలసి డాలస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి డెల్ వెబ్ బోలెవర్డ్ ప్రాంతంలో వారి కారు ఓవర్ టేక చేస్తుండగా ఓ ట్రక్కు ఢీకొట్టింది. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త తెలియడంతో ముషీరాబాద్‌లోని రాజా కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయం చేయాలని ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.