హనీమూన్‌కెళ్లి జైలు పాలైన కొత్త దంపతులు  - MicTv.in - Telugu News
mictv telugu

హనీమూన్‌కెళ్లి జైలు పాలైన కొత్త దంపతులు 

October 25, 2020

Couple from Mumbai is serving sentence in Qatar jail

కొత్తగా పెళ్ళైన జంట ఎంజాయ్ చేయడానికి హనీమూన్‌కు వెళ్తుంది. కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తారు. కానీ, ముంబైకి చెందిన ఓ జంట హనీమూన్‌కు వెళ్లి విదేశాల్లో జైలు పాలైంది. ముంబైకి చెందిన ఒనీబా, షరీఖ్‌లు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త జంటకు వారి బంధువు తబస్సం రియాజ్ ఖురేషీ పెళ్లి గిఫ్ట్‌గా హనీమూన్ కోసం ఖతార్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. 2019 జులై 6 వారు హనీమూన్‌కు బయల్దేరారు. హనీమూన్‌కు వెళ్తున్న ఒనిబా, షరీఖ్‌ల సామాన్లలో 4 కిలోల డ్రగ్స్ పెట్టాడు. ఆ విషయం ఆ కొత్త జంటకు తెలీదు. 

నవదంపతులు ఖతార్ విమానాశ్రయంలో దిగగానే అక్కడి కస్టమ్స్ అధికారులు వారి సామాన్లు తనిఖీ చేశారు. అందులో తబస్సం రియాజ్ ఖురేషీ పెట్టిన నాలుగు కిలోల మాదకద్రవ్యాలు లభించాయి. అవి తమ సామాన్లలోకి ఎలా వచ్చాయో తమకు తెలియదని వారు ఎంత చెప్పినా కస్టమ్స్ అధికారులు వినలేదు. వారిని ఖతార్ జైలుకు పంపించారు. ఈ జంటకు పదేళ్ల జైలు శిక్షతోపాటు కోటి రూపాయల జరిమానా విధించారు. ఈ క్రమంలో ఒనిబా జైలులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నేరంలో వారి ప్రమేయం ఏమి లేదని తెలిసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఈ జంటను భారత్‌‌కు తీసుకునిరావడానికి ఖతార్ అధికారులతో దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.