విజయవాడలో దంపతుల మృతి.. వెంటాడుతున్న కరోనా భయం - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో దంపతుల మృతి.. వెంటాడుతున్న కరోనా భయం

March 31, 2020

Couple no more in vijayawada.. Coronavirus doubts

ఏపీలో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా ఇద్దరి భార్యాభర్తలు మృతిచెందడం కలకలం రేపుతోంది. విజయవాడలోని పాతబస్తీకి చెందిన భార్యభర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించారు. ఇటీవల వీరు ఢిల్లీలోని ఓ మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చారని స్థానికులు చెబుతున్నారు. వారు ఆ కార్యక్రమానికి వెళ్లొచ్చి జబ్బు పట్టారని చెప్పారు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఒకే లక్షణాలతో 24గంటల వ్యవధిలో చనిపోయారు. దీంతో వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం భార్య న్యుమోనియాతో మరణించగా.. సోమవారం ఉదయం ఆమె భర్త కూడా అవే లక్షణాలతో  మృతిచెందారు. దగ్గు, ఆయాసం లక్షణాలతో వీరిద్దరు కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందడంతో కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే వారి మృతదేహాలను పరీక్షించిన వైద్యులు ఇంకా దృవీకరించడంలేదు.

ఈ ఘటనపై అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం వెంటనే వారు ఎవరెవరిని కలిశారో ఆరాతీశారు. వారి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటనపై డీఎంహెచ్‌వో అధికారులు మాట్లాడుతూ.. ‘దంపతుల మృతిపై నివేదికలు వస్తేనే మేము అధికారంగా చెప్పలేం. విజయవాడలోని ఇదే ప్రాంతానికి చెందిన మరో 26 మంది కూడా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి వెళ్లిన్నట్లుగా గుర్తించాం. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నాం’ అని తెలిపారు.