తిరుమలలో దోపిడీ.. టీటీడీపై హైకోర్టు కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమలలో దోపిడీ.. టీటీడీపై హైకోర్టు కన్నెర్ర

October 25, 2017

వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో హోటళ్లు, షాపులు అధిక ధరలతో భక్తులను దోపిడీ చేస్తోంటే ఏం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిమాలిన మాటలు కట్టిపెట్టి భక్తులను ఈ దోపిడీ నుంచి కాపాడాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని రూ. 50వేల వరకు జరిమానా వేశామని టీటీడీ చెప్పింది. ఈ వాదనపై కోర్టు మరింతగా విరుచుకుపడింది. ‘మీరు 50 వేల జరిమానా వేస్తారు.

కానీ హోటళ్ల దోచుకున్న సొమ్ము 50వేలకంటే ఎక్కువ ఎంటే ఏం ప్రయోజనం..? వాళ్లలా దోచుకుంటూనే ఉంటారు. మీరలా చూస్తూ ఉంటారు. టీటీడీ ఈవో తాను చట్టానికి అతీతం అనుకుంటున్నారేమో.. ఆయనను కోర్టు రమ్మని చెప్పిండి’ అని అక్షింతలు వేసింది. తిరుమలలోని హోటళ్లు, దుకాణాలు భక్తులను దోచుకుంటున్నాయని దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది. రూ. 500, రూ. 2వేల నోట్లకు చిల్లర ఇవ్వడం లేదని, చిల్లర కావాలని అడిగితే రూ. 100 వరకు కమిషన్ రూపంలో కొల్లగొడుతున్నారని పిటిషనర్లు ఆరోపించారు.