రెండేళ్లయినా సెక్స్ చేయని భర్త.. 30 వేల పరిహారం - MicTv.in - Telugu News
mictv telugu

రెండేళ్లయినా సెక్స్ చేయని భర్త.. 30 వేల పరిహారం

June 18, 2022

పెళ్లి చేసుకొని రెండేళ్లయినా తన భర్త తనతో శృంగారం చేయట్లేదని ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. దాంతో విచారించిన కోర్టు.. తనదైన శైలిలో తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళ దిలేశ్వర్ (32) అనే వ్యక్తిని ప్రేమించింది. ఇలా రెండేళ్లు ప్రేమలో మునిగాక చివరికి పెళ్లి చేసుకుంది. అయితే అప్పటినుంచి ఆమెకు సమస్య ప్రారంభమైంది. శోభనం రాత్రి నుంచి తన భర్త ఆమెను ఒక్కసారి కూడా తాకలేదు. కొన్ని రోజులు వేచి చూసి తనే స్వయంగా ప్రయత్నించింది. అయినా కూడా భర్తలో చలనం లేదు. తాను దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతీసారి వేరే గదిలోకి వెళ్లి పడుకునేవాడు. రాత్రిళ్లు ఇలా ప్రవర్తిస్తుండగా, పగలేమో ఆడవారిలా మేకప్ వేసుకునే వాడు. లిప్ స్టిక్, ఇయర్ రింగ్స్ పెట్టుకునేవాడు. ఇలా ప్రవర్తించవద్దని వేడుకున్నా వినేవాడు కాదు. పైగా నా ఇష్టం అంటూ కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య.. తనకు విడాకులు ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేసింది. పై విషయాలన్నీ పిటిషన్‌లో పేర్కొంది. దాంతో విచారించిన కోర్టు విడాకులు మంజూరు చేస్తూ.. భార్యకు ప్రతీనెలా రూ. 30 వేల పరిహారం చెల్లించాలని భర్త దిలేశ్వర్‌ను ఆదేశించింది. అలాగే, ఇదేమీ పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రేమించే పెళ్లాడారు కాబట్టి భర్త కావాలనే మోసం చేసినట్టు గుర్తించింది. అలాగే, భార్య ఓపికను ప్రశంసించింది.