Court order to stop OTT release of Yashoda movie
mictv telugu

యశోద సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని ఆదేశించిన కోర్టు

November 24, 2022

సమంత నటించిన తాజా చిత్రం యశోద నవంబర్ 11 న విడుదలై మంచి వసూళ్లు సాధించింది. సరోగసీ నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి సినిమాగా, సమంత నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడడంతో సినిమా తేలికగా విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ విషయంలో సమస్య ఎదురైంది. సినిమాలో ఇవా హాస్పిటల్ పేరు దెబ్బతినేలా చూపించారని ఆస్పత్రి యాజమాన్యం సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో అలా చూపించడం వల్ల ఆసుపత్రి పేరు దెబ్బతినిందని, ఓటీటీ విడుదలను ఆపాలని కోరింది. దీంతో కోర్టు ఆదేశాలు చిత్ర యూనిట్ కి ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు చిత్రాన్ని ఓటీటీలో ప్రదర్శించకూడదని, తదుపరి విచారణను డిసెంబర్ 19 తర్వాత వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : నీకు చాలా పొగరు – వెన్నెల కిషోర్ విషెష్ పై మంచు విష్ణు ఫైర్