సీన్ రివర్స్.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

సీన్ రివర్స్.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు

October 22, 2020

Court orders wife to pay Rs 1,000 monthly maintenance allowance to husband

సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే భర్త నుంచి భార్యకు భరణం ఇప్పిస్తారు. అయితే ఓ కేసులో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తకు ప్రతినెెలా భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. చాలా సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇరువురూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే హిందూ వివాహ చట్టం-1955 కింద తన భార్య నుంచి భరణం ఇప్పించాలంటూ ఆమె భర్త 2013లో కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. 

దీనిపై నిన్న ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడిగా ఉంటున్న సదరు మహిళకు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పెన్షనర్‌ అయిన ఆమె ప్రతినెలా భర్తకు భరణం కింద రూ.1000 చెల్లించాలని ఆదేశించింది. ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయడంతో ఆమెకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ.12,000 పెన్షన్ వస్తోంది. దీంతో ఆమె తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా రూ.1000 చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.